• Talk To Astrologers
  • Brihat Horoscope
  • Ask A Question
  • Child Report 2022
  • Raj Yoga Report
  • Career Counseling

ఈరోజు రాహుకాలం – Today Rahu Kaalam

రాహుకాలం అంటే ఏమిటి?

రాహుకాలం ఒకరోజులో ఆమోదయోగ్యముకాని/చెడు సమయముగా చెప్పబడుతుంది.పేరు ప్రకారముగా, ప్రతిరోజూ కొంతసమయము ఇలా ఉంటుంది.రోజులో ఒక గంటన్నర సమయానికి రాహువు అధిపతిగా ఉంటాడు.కావున,ఈ సమయాన్ని చెడుసమయముగా పరిగణిస్తారు మరియు ఈసమయములో ఎటువంటి ముఖ్యపనులను ప్రారంభించరు.కొన్నీ నమ్మకాల ప్రకారము, రాహుకాలములో ప్రారంభించిన పనులు మంచిఫలితాలు ఇవ్వవు మరియు అవి విఫలము చెందుతాయి అని నమ్ముతారు.దక్షిణ భారతదేశములో ఈయొక్క రాహుకాలమును ఎక్కువగా అనుసరిస్తారు మరియు నమ్ముతారు.

సాధారణముగా ప్రజలు రాహుకాలాన్ని మాములుగా గణిస్తారు,ఉదయము 6:00గంటలకు సూర్యోదయమును తీసుకుని గణిస్తారు.కానీ సరైనపద్ధతిలో సూర్యోదయ సమయాన్ని బట్టి రాహుకాలమును గణించాలి.దీనిలో రోజుకి మరియు రోజుకిమధ్య వ్యత్యాసము ఉంటుంది.అంతేకాకుండా, ప్రాంతాలకు మధ్య వ్యత్యాసము ఉంటుంది.కింద ఇవ్వబడిన మీయొక్క ప్రాంతముయొక్క సూర్యోదయ ఆధారముగా ఖచ్చితముగా లెక్కించబడినది.

ఈరోజు రాహుకాలం సమయము:
08:00:24 AM నుండి 09:22:14 AM

నవంబర్ 2024 యొక్క రాహుకాలము (Hindaun నగరము కొరకు)

తారీఖు వారము ఇ ప్పటినుండి అప్పటివరకు
11 నవంబర్ 2024 సోమవారం 08:00:24 AM 09:22:14 AM
12 నవంబర్ 2024 మంగళవారం 2:49:24 PM 4:11:05 PM
13 నవంబర్ 2024 బుధవారం 12:06:10 PM 1:27:43 PM
14 నవంబర్ 2024 గురువారం 1:27:43 PM 2:49:07 PM
15 నవంబర్ 2024 శుక్రవారం 10:45:15 AM 12:06:30 PM
16 నవంబర్ 2024 శనివారం 09:24:27 AM 10:45:34 AM
17 నవంబర్ 2024 ఆదివారం 4:09:47 PM 5:30:45 PM
18 నవంబర్ 2024 సోమవారం 08:04:34 AM 09:25:24 AM

ఇతర నగరాల కోసం, ఇక్కడ క్లిక్ చేయండి


రాహుకాల్ ని, దక్షిణ భారతదేశములో రాహుకాలం అనికూడా పిలుస్తారు.ఇదిప్రతిరోజులో ఒకగంటన్నర సమయము ఉంటుంది.వైదిక జ్యోతిష్యశాస్త్రము ప్రకారము, రాహువు ప్రతికూల గ్రహముగా వర్ణింపబడినాడు. హిందూధర్మములో, ఏదైనా పని ప్రారంభించే ముందు ముహూర్తము చూడటము అనేది ఓక ఆచారము.ఈ రాహుకాల సమయము కొత్తపనులను ప్రారంభించటానికి ఆమోదయోగ్యముకాని సమయముగా చెప్పబడినది.

రాహుకాల ప్రాముఖ్యత:

వైదిక జ్యోతిష్య శాస్త్రము ప్రకారము, ఏదైనా కొత్తపనులు ప్రారంభించేటప్ప్పుడు రాహుయొక్క ప్రభావ సమయము ఆమోదయోగ్యము కాదు.మనము ఈసమయములో పూజ,యజ్ఞయాగాదులు నిర్వహించకూడదు.చెడు ప్రభావాన్ని కలిగించే రాహువు శుభకార్యాలకు వ్యతిరేక ఫలితాలను అందిస్తాడు.ఒకవేళ ఎవరైన ఈసమయములో పనులు ప్రారంభిస్తే వారు అనుకున్న లేదా తలపెట్టిన పనులు పూర్తికావు.

దక్షిణ భారతదేశములో రాహుకాలానికి అత్యంత ప్రాముఖ్యతను ఇస్తారు.ఇది ప్రతిరోజులో గంటన్నర లేదా 90నిమిషాల సమయముపాటు ఉంటుంది.ఇది మీకు వివాహమునకు,కొత్త పనులకు,ప్రయాణాలకు, ఏదైనా కొనటానికి, గృహప్రవేశానికి, కొత్తవ్యాపారాలకు, ఇంకేమైన ముఖ్యమైనపనుల ప్రారంభానికి,ఆమోదయోగ్యముకాని లేదా చెడుసమయముగా పరిగణించబడినది.ఇది ప్రతిరోజు వివిధ నగరాల్లో, వివిధ సమయాల్లో సంభవిస్తుంది. ముందుకువెళ్లే ముందు వాటిని అర్ధము చేసుకుందాము.

వైదిక జ్యోతిష్యశాస్త్రములో రాహువు అంటే ఏమిటి?

మహర్షుల ప్రకారము, శ్రీ మహావిష్ణువు క్షీరసాగర మధన సమయములో అమృతాన్ని పంచేటప్పుడు రాక్షసులను ఏమరుస్తారు.మహావిష్ణువు దేవతలకు అమృతాన్ని మరియు రాక్షసులకు సురాపానాన్ని అందిస్తాడు.స్వర్భాను అను ఒక రాక్షసుడు దీనిని గమనించి, దేవతల వరుసలో కూర్చుంటాడు.తద్వారా కొన్నిబిందువుల అమృతాన్ని పొందుతాడు.అయినప్పటికీ, సూర్యుడు మరియు చంద్రుడు ఇదిచూసి మహావిష్ణువుకు సైగచేస్తారు.కానీ, అప్పటికే ఆ రాక్షసుడు అమృతాన్ని స్వీకరించేస్తాడు.

ఈయొక్క పరిస్థితి తరువాత, శరీరంయొక్క తలభాగము రాహువుగా,మిగిలిన భాగము కేతువుగా ఏర్పడతారు. అందువల్ల రాహువుని శరీరములేని వాడిగా గుర్తిస్తాడు.ఇతను ఎక్కువగా మక్కువ కలవాడు మరియు ఎక్కువగా కోరుకుంటాడు.ఇది మనిషియొక్క మనస్సును చుట్టుముడుతుంది.

రాహుకాల సమయములో ఏమి జరుగుతుంది ?

రాహుకాల సమయము ఎటువంటి కొత్తపనులను ప్రారంభించడానికి ఆమోదయోగ్యముకానీ సమయము. అయినప్పటికీ, అప్పటికే ప్రారంభించిన లేదా రోజువారి కార్యకలాపాలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు.మనము ఇక రాహువుయొక్క అనుకూలత వైపుచుస్తే, రాహువుకు సంబంధించిన ఎటువంటి పనులుఅయిన అనుకూల ఫలితాలను అందిస్తాయి.ఈ సమయములో రాహువు ప్రభావముయొక్క రెమిడీలు కూడా పాటించవచ్చును.

రాహుకాలమును ఎలా గణిస్తారు?

వైదిక జ్యోతిష్య శాస్త్రములో రాహుకాలమును గణించటానికి ప్రత్యేకమైన పధ్ధతి ఉంటుంది.దీనిప్రకారము, సూర్యోదయ మరియు సూర్యాస్తమయ సమయాన్ని 8భాగాలుగా విభజిస్తారు.ఉదాహరణకు, సూర్యోదయము ఉదయము 6:00గంటలకు అనుకుంటే సూర్యాస్తమయము 6:00గంటలకు అనుకుందాము.మనందరికీ తెలిసిందే పగలు 12గంటలు ఉంటుంది.కావున ఈ 12గంటలను 8సమాన భాగాలుగా విభజిస్తారు.అంటే, ప్రతి భాగమునకు 1.5గంటల సమయము ఉంటుంది.రాహుకాలమునకు కూడా రోజులో 1.5గంటల సమయము ఉంటుంది. అభివ్యక్తీకరణ ప్రకారము,క్రింద చార్టు ఇవ్వబడినది

వారములో ప్రతిరోజు రాహుకాల సమయము

వారము రాహుకాలము
ఆదివారము 04:30 PM to 06:00 PM
సోమవారం 07:30 AM to 09:00 AM
మంగళవారం 03:00 PM to 04:30 PM
బుధవారం 12:00 PM to 01:30 PM
గురువారం 01:30 PM to 03:00 PM
శుక్రవారం 10:30 AM to 12:00 PM
శనివారం 09:00 AM to 10:30 AM

రాహుకాల సమయములో మనము చేయకూడని పనులు ఏమిటి?

  • ఈ సమయము రోజువారీ జీవితములో రాహువుయొక్క ప్రభావానికి చెందినది.ఈసమయములో భగవంతుని కృప పొందటానికి ఏవిధమైన పూజలు, యజ్ఞయాగాదులు చేయరాదు.
  • రాహుకాల సమయములో ఎటువంటి కొత్తవ్యాపారాలను ప్రారంభించకూడదు.
  • రాహుకాల సమయములో ఎటువంటి ప్రయాణాలు మరియు శుభకార్యక్రమాలు చేయకూడదు.
  • ఈసమయములో మనము ఎటువంటి శుభకార్యాలు అంటే పుట్టువెంట్రుకలు, నిశ్చితార్ధము, వివాహము, ఉపనయనము, గృహప్రవేశము వంటివి చేయకూడదు.
  • రాహుకాల సమయములో ఎటువంటి ఆర్ధికలావాదేవీలు జరపకూడదు.
  • రాహుకాల సమయములో ఎటువంటి వస్తువులను అంటే, ఆభరణాలు, గృహోపకరణాలు, వాహనములు కొనుగోలు చేయకూడదు.
  • ఒకవేళ ప్రయాణము అత్యవసరములైతే ఇంటిలో ఏదైనా తీపిపదార్థమును తీసుకుని బయలుదేరుట మంచిది.
  • మీరు ఇంటినుండి ప్రయాణము చేయవలసివస్తే, ఇంటినుండి ఒక నాలుగు అడుగులు వెనక్కివేసి తరువాత ముందుకు వెళ్ళటం చేయండి.
  • మీరు ఏదైనా శుభప్రదమైన కార్యాన్ని రాహుకాలములో చేయవలసి వస్తే, హనుమంతునికి బెల్లము మరియు పంచామృతము నివేదించి, హనుమాన్చాలీసా పఠించండి.తరువాత, పంచామృతాన్ని మరియు బెల్లాన్ని స్వీకరించి మీయొక్క శుభకార్యములను మొదలుపెట్టండి.
Buy Today
Gemstones
Get gemstones Best quality gemstones with assurance of AstroCAMP.com More
Yantras
Get yantras Take advantage of Yantra with assurance of AstroCAMP.com More
Navagrah Yantras
Get Navagrah Yantras Yantra to pacify planets and have a happy life .. get from AstroCAMP.com More
Rudraksha
Get rudraksha Best quality Rudraksh with assurance of AstroCAMP.com More
Today's Horoscope

Get your personalised horoscope based on your sign.

Select your Sign
Free Personalized Horoscope 2025
© Copyright 2024 AstroCAMP.com All Rights Reserved