• Talk To Astrologers
  • Brihat Horoscope
  • Ask A Question
  • Child Report 2022
  • Raj Yoga Report
  • Career Counseling
Personalized
Horoscope

2025 రాశిఫలాలు ఆస్ట్రోక్యాంప్ ఆర్టికల్ ద్వారా తెలుసుకోండి!

Author: Vijay Pathak | Last Updated: Wed 4 Sep 2024 1:12:37 PM

ఈ ఆస్ట్రోక్యాంప్ ఆర్టికల్ ద్వారా 2025 రాశిఫలాలు గురించి తెలుసుకోండి. ఆస్ట్రోక్యాంప్ యొక్క 2025 జాతకం మొత్తం 12 రాశుల కోసం 2025 సంవస్త్రానికి నమ్మదగిన సూచనలను అందిస్తుంది. వేద జ్యోతిష్యశాస్త్రం ఆధారంగా ఈ జాతకం 2025 మానవ జీవితంలోని అనేక అంశాల యొక్క వివరణాత్మక పరిష్కారంలో సహాయపడుతుంది. అలాగే 2025 సంవస్త్రానికి వారి జీవితానికి సంబంధించిన 2025 అంచనాలను అందుకోవాలనే వ్యక్తులందరికి తెలియజేస్తుంది. మీ ఆదర్శ జీవితాన్ని వివాహం చేసుకోవాలనే మీ కల నెరవేరుతుందా? కుటుంబ జీవితంలో శాంతి, సంతోషాలు ఉంటాయా? మీ ఆరోగ్యానికి ఏం జరగబోతుంది? ప్రతి సంవస్త్రం మీ మనస్సులో వచ్చే అనేక సమస్యలకు సమాధానమివ్వడానికి మేము ఆస్ట్రోక్యాంప్ యొక్క 2025 జాతకాన్ని అందిస్తున్నాము, ఇది మీ అన్ని ప్రశ్నలకు సమాధానాలను అందిస్తుంది.

Horoscope 2025 Landing Page

हिंदी में पढ़ने के लिए यहां क्लिक करें: 2025 राशिफल

2025 ప్రధాన అంచనాల గురించి మాట్లాడకముందే ప్రస్తుతం కుంభరాశిలో ఉన్న శనిగ్రహం మార్చ్ 29న కుంభరాశిని వదిలిపెట్టి మీనరాశిలోకి ప్రవేశిస్తుంది. ఈ సంవస్త్రం అక్టోబర్ 19న ఇది కర్కాటకరాశిలోకి ప్రవేశిస్తుంది అక్కడి నుండి డిసెంబర్ 4న తిరోగమనంలో మిథునరాశికి తిరిగి వస్తుంది. రాహువు ఇంకా కేతువుల పరంగా మే 18న రాహువు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు ఇంకా కేతువు సింహారాశిలోకి ప్రవేశిస్తాడు. 2025 ప్రారంభంలో కుజుడు వృషభరాశిలోకి ప్రవేశిస్తాడు, సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. శుక్రుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు ఇంకా బుధుడు వృషభరాశిలోకి ప్రవేశిస్తాడు.

Click Here To Read in English:2025 Horoscope

2025 గురించి మరింత తెలుసుకోవడానికి, ఉత్తమ జ్యోతిష్కులతో మాట్లాడండి!

మేషరాశి

2025 జాతకం ప్రకారం మేషరాశి వారు 2025లో మిశ్రమ ఫలితాలను అనుభవిస్తారు. సంవస్త్రం ప్రారంభంలో మీరు ఆస్తి కొనుగోలులో విజయం సాధించినప్పటికి మార్చ్ తర్వాత మీ ఖర్చులు ఊహించని విధంగా పెరిగే అవకాశం ఉంది. ఈ సంవస్త్రం కొంత ఖర్చు కొనసాగే అవకాశం ఉంది, అలాగే ఆరోగ్యంలో హెచ్చు తగ్గులు ఉన్నాయి. 2025 రాశిఫలాలుమే 18 తర్వాత రాహువు మారడం వల్ల ఆశయాలు నెరవేరే అవకాశాలు, ఆదాయం పెరుగుతుంది. ఈ సంవస్త్రం ప్రేమ సంబంధాల ప్రేమ పరంగా మితంగా ఉంటుంది, వివాహ సంబంధాలలో మితమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. బృహస్పతి అనుగ్రహంతో మే 15 నుండి మీరు వైవాహిక సంబంధాలు ఇంకా వ్యాపారంలో మంచి ఫలితాలను అనుభవిస్తారు ఇంకా ఈ సంవస్త్రం మీ వృత్తికి అనుకూలంగా ఉంటుంది.

వివరంగా చదవండి: మేషం 2025 రాశిఫలాలు

రాజ్ యోగా నివేదిక సంపదలు మరియు శ్రేయస్సు మిమ్మల్ని ఎప్పుడు అనుగ్రహిస్తాయో తెలుసుకోండి!

వృషభరాశి

2025 జాతకం ప్రకారం 2025 సంవస్త్రం వృషభరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. కొత్త సంవస్త్రం సానుకూలంగా ప్రారంభమవుతుంది. శృంగార సంబంధాలు, వివాహం ఇంకా ఆరోగ్యానికి ఇది మంచి సమయం. మీ పదవ ఇంట్లో శని ప్రభావం సంవస్త్రం ప్రారంభంలో స్థిరత్వం ఇంకా మీ ఆదాయంలో వృద్దినవ తెస్తుంది. తరువాత మార్చ్ నుండి సంవస్త్రం చివరి వరకు మీ పదకొండవ ఇంట్లో శని ప్రభావం ఉంటుంది. కోరికలు నెరవేరుతాయి. పెండింగ్ లో ఉన్న పని పూర్తి అవుతుంది, ఇది మీకు మరింత విశ్వాసాన్ని ఇస్తుంది. సంవస్త్రం ప్రారంభంలో ఆశించిన ఉద్యోగ ఫలితాల కారణంగా మనస్సులో సంతృప్తి ఉంటుంది. రాహువు పద ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత మీరు పనిలో జాగ్రత్తగా ఉండాలి.

వివరంగా చదవండి: వృషభం 2025 రాశిఫలాలు

మిథునరాశి

2025 జాతకం ప్రకారం 2025 సంవస్త్రం మిథునరాశి వారికి చాలా సానుకూల ఫలితాలను తెస్తుంది అయితే ఈ సంవస్త్రం ప్రారంభంలో కుటుంబ జీవితం పరంగా కష్టంగా ఉంటుంది. మే నెల నుండి కుటుంబ సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి. దూర ప్రయాణాలు, తీర్థయాత్రలు చేసే అవకాశాలు ఉన్నాయి. శని ఆశీర్వాదం మీ పనిని బలపరుస్తుంది ఇంకా మీ వృత్తిని మరింత నమ్మదగినదిగా చేస్తుంది. మీరు మీ వృత్తిపరమైన ఇంకా వ్యాపార ప్రయత్నాలలో విజయం సాదిస్తారు. పనిలో ఎక్కువ హడావిడి ఉంటుంది. బృహస్పతి సహాయంతో మే 15 నుండి వైవాహిక ఇంకా ప్రేమ సంబంధాలు మరింత తీవ్రమవుతాయి. మీ ఆరోగ్యం కూడా మెరుగుపడే అవకాశం ఉంది.

వివరంగా చదవండి: మిథునం 2025 రాశిఫలాలు

కర్కాటకరాశి

కర్కాటకరాశి వారికి 2025 జాతకం ప్రకారం సంవస్త్రం ప్రారంభం నాటికి తమ కోపాన్ని అరికట్టాలి లేకపోతే వైవాహిక సమస్యలు ఇంకా ఆర్థిక నష్టాలు ఉండే అవకాశం ఉంది. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో కొంత నిరుత్సాహంగా ఉంటుంది. 2025 రాశిఫలాలు ప్రకారంఆరోగ్యం క్షీణించినప్పటికి మార్చ్ నుండి పరిస్థితులు మెరుగుపడతాయి. దూర ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి. మీకు లాభదాయకంగా ఉండే వ్యాపార పరిచయాలు ఏర్పడతాయి. ఈ సంవస్త్రం వృత్తిపరమైన పురోగతిని కలిగిస్తుంది. మీరు మతపరమైన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు, ఇది మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. అవివాహిత వ్యక్తులు వివాహం గురించి సానుకూల వార్తలను అందుకుంటారు.

వివరంగా చదవండి: కర్కాటక 2025 రాశిఫలాలు

మీ కుండలి ప్రకారం అనుకూలీకరించిన మరియు ఖచ్చితమైన శని నివేదికను పొందండి!

సింహరాశి

2025 జాతకం ప్రకారం సింహారాశిలో జన్మించిన వ్యక్తులు 2025 లో మిశ్రమ అదృష్టాన్ని అనుభవిస్తారు. ఈ సంవస్త్రం మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే దానిని విస్మరిస్తే తీవ్రమైన అనారోగ్యం ఏర్పడుతుంది. రాహువు మే నుండి మీ ఏడవ ఇంట్లోకి ప్రవేశించడం వల్ల వివాహ సంబంధాలలో హెచ్చు తగ్గులు, అలాగే వ్యాపారంలో స్థిరత్వం లోపిస్తుంది. సంవస్త్రం ప్రారంభం ఉద్యోగానికి లాభదాయకంగా ఉంటుంది. ప్రేమ సంబంధాల పరంగా సంవస్త్రం ప్రారంభంలో అడ్డంకులను ఎదరుకుంటారు. కానీ పరిస్థితి క్రమంగా మెరుగుపడుతూ వస్తుంది. ఈ సంవస్త్రం మీరు విదేశీ ఎనకౌంటర్ ల నుండి గొప్పగా లాభపడతారు.

వివరంగా చదవండి: సింహం 2025 రాశిఫలాలు

కన్యరాశి

కన్యారాశికి 2025 జాతకం ప్రకారం ఈ సంవస్త్రం ప్రారంభంలో మీకు హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది అయితే మీ పని పూర్తవుతుంది ఇంకా మీ కోరికలు నెరవేరుతాయి. ధన లాభం పొందుతారు. శృంగార సంబంధాలలో ఒత్తిడిలు పెరుగుతాయి. వివాహ సంబంధాలలో, అభద్రతా భావాలు పెరుగుతాయి. మార్చ్ చివరిలో శని మీ ఏడవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఇది మీ దీర్ఘకాలిక వ్యాపార నిర్ణయాలకు ప్రవయోజనం చేకూరుస్తుంది. మీ వైవాహిక సంబంధంలో మీరు ఎంత న్యాయంగా ఇంకా నిజాయితీగా ఉంటే అది మధురంగా మారుతుంది. వ్యాపారంలో అనుకూలత ఉంటుంది ఇంకా పని చేసేవారు మరింత కష్టపడాల్సి ఉంటుంది. మతపరమైన కార్యకలాపాలు ప్రజలకు సహాయపడతాయి ఇంకా సమాజంలో వారి స్థితిని పెంచుతాయి.

వివరంగా చదవండి: కన్య 2025 రాశిఫలాలు

Click Here To Read in English:2025 Horoscope

తులారాశి

2025 జాతకం ప్రకారం తులారాశి వారికి ఈ సంవస్త్రం అదృష్టం తెస్తుంది. ప్రేమ సంబంధాలు ఉద్వేగభరితంగా ఉంటాయి. మీరిద్దరు శృంగారభరితంగా మారే అవకాశం ఉంది. వివాహిత సంబంధంలో పరస్పర సాన్నిహిత్యం పెరుగుతుంది ఇంకా దూరం కూడా తగ్గుతుంది. మీరు మతపరమైన వ్యవహారాలలో చురుకుగా పాల్గొంటారు. మే నెలలో బృహస్పతి తొమ్మిదవ ఇంట్లో ఉండటం వల్ల మతపరమైన ప్రయాణాలు ఇంకా తీర్థయాత్రలు ఎక్కువగా చేసే అవకాశం ఉంది. శని మార్చ్ నెల చివరిలో ఆరవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. రాజకీయాలలోని వారికి అనుకూలంగా ఉంటుంది ఇంకా పోటీలలో విజయం సాధిస్తారు. మీరు పనిలో మీ ప్రత్యర్థులను అధిగమిస్తారు ఇంకా మంచి డబ్బు సంపాదిస్తారు. ఐదవ ఇంట్లోకి రాహువు ప్రవేశించడం ఇంకా పదకొండవ ఇంట్లోకి కేతువు ప్రవేశించడం మే నెలలో మీ ఆర్థిక స్థితిని సానుకూలంగా ప్రభావితం చేయడం ప్రారంభిస్తాయి.

వివరంగా చదవండి: తులా 2025 రాశిఫలాలు

వృశ్చికరాశి

2025 వృశ్చికరాశి జాతకం ప్రకారం మీరు సంవస్త్రం ప్రారంభంలో ఆనందాన్ని పొందే అవకాశం ఉంది. శృంగార సంబంధాల పరంగా మాధుర్యం పెరుగుతుంది ఇంకా శృంగారం సాధ్యమవుతుంది. వివాహ సంబంధాలు మనోహరంగా ఉంటాయి. 2025 రాశిఫలాలు లోమీ భాగస్వామి మీకు తగిన దిశీనిర్దేశం ఇంకా నిబద్దతను అందిస్తారు. వ్యాపార పురోగతికి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం ఉన్న స్థానికులు గణనీయమైన ఆర్థిక ప్రయోజనాలను పొందే అవకాశం కూడా ఉంటుంది. మీరు సంవస్త్రం ప్రారంభంలో రియల్ ఎస్టేట్ యొక్క భాగాన్ని కొనుగోలు చేయడంలో విజయం సాధించవొచ్చు. మార్చ్ నెలలో శని ఐదవ ఇంట్లోకి ప్రవేశించడం వల్ల పిల్లల విషయంలో ఆంధోళనాలు ఉంటాయి. ఉద్యోగంలో కూడా మార్పులు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారంలో ఆర్థిక లాభం తో పాటు ఆదాయం పెరుగుతుంది.

వివరంగా చదవండి: వృశ్చిక 2025 రాశిఫలాలు

ఆస్ట్రోక్యాంప్ బృహత్ కుండ్లి ఖచ్చితమైన మరియు నమ్మదగిన జీవిత అంచనాలను పొందండి!

ధనుస్సురాశి

2025 జాతకం ప్రకారం ధనుస్సురాశిలో జన్మించిన వారికి సంవస్త్రం ప్రారంభంలో అద్భుతమైన అదరుహస్తం ఉంటుంది. మీరు పనిలో విజయం సాదిస్తారు కానీ మీరు కొన్ని కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదురుకుంటారు. వాహనాన్ని జాగ్రత్తగా నడపకపోతే ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. చిన్న విహారాయాత్రలు ప్రయోజనకరంగా ఉంటాయి. మీ స్నేహితులు మిమల్ని బాగా చవస్తారు, ఈద్ మీ బంధాన్ని బలపరుస్తుంది. మీ స్వంత అహం సంవస్త్రం ప్రారంభంలో మీ వివాహంలో ఉద్రిక్తను కలిగిస్తుంది. తరువాత మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. మే లో బృహస్పతి ఏడవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు ఇది వివాహ సమస్యలను పరిష్కరిస్తుంది. ప్రజల మధ్య భక్తి ఆప్యాయత ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి మరియు నిర్ణయం తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది.

వివరంగా చదవండి: ధనుస్సు 2025 రాశిఫలాలు

మకరరాశి

2025 మకరరాశి జాతకం ప్రకారం సంవస్త్రం ప్రారంభంలో మీరు విదేశీ ప్రయాణంలో విజయం సాధించవొచ్చు, వాదనలు ఇంకా ఆరోగ్య సమస్యలకు అవకాశం ఉన్నందున ఈ సమయంలో మీ వైవాహిక సంబంధాలలో జాగ్రత్త వహించాలి. ఈ రకమైన పరిస్థితిలో వారికి మీ సహాయం అవసరం. ఈ శుక కాలం నుండి ప్రేమ సంబంధాలు లాభిస్తాయి. మీ విశ్లేషణ నైపుణ్యాలు ఉద్యోగంలో మీకు సహాయపడతాయి. ఉద్యోగ మార్పిడికి అవకాశం ఉంటుంది. 2025 రాశిఫలాలు ప్రకారంఆర్థికంగా లాభపడే అవకాశాలు ఉంటాయి. ప్రేమ బంధాల బలం పెరుగుతుంది. సంవస్త్రం ద్వితీయార్థంలో కుటుంబంలో కొంత అశాంతి నెలకొంటుంది. ఆరోగ్య సమస్యలు మరింత తీవ్రమవుతాయి అయితే మార్చ్ చివరిలో శని మూడవ ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత వాటిని అధిగమించడం సులభం అవుతుంది.

వివరంగా చదవండి: మకరం 2025 రాశిఫలాలు

కుంభరాశి

కుంభరాశి వారి 2025 సంవత్సరం ప్రభావాలను చర్చిస్తే, 2025 జాతక ప్రకారం సంవత్సరం ప్రారంభం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారలో సానుకూల పురోగతి ఇంకా జీవిత భాగస్వాముల మధ్య బలమైన సంబంధాలు ఉంటాయి. మీ లక్ష్యాలు నెరవేరుతాయి. కుటుంబాల మధ్య అందమైన అనుబంధాలు ఏర్పడతాయి. కుటుంబ సమేతంగా పూజలు వంటి శుభకార్యలు నిర్వహిస్తారు. మీరు కంపెనీలో పటిష్టమైన స్థానాన్ని కలిగి ఉంటారు, కానీ మీరు ఇప్పటికీ మీ పోటీదారులపై నిఘా ఉంచాలి. మేలో రాహువు మీ స్వంత రాశిలోకి ప్రవేశించనప్పుడు, మీరు చాలా జాగ్రతగా ఉండాలి, ఎందుకంటే ఇది మీ వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితాన్ని ప్రభావితం చేసే నిర్ణయాలు తీసుకునే మీ సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది మార్చి చివరి నుండి శని మీ రెండవ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు మీరు ఇతరుల నుండి కఠినమైన మాటలు మాట్లాడటం లేదా స్వీకరించడం మానుకోవాలి. సంబంధాలు హెచ్చు తగ్గులు అనుభవించవచ్చు.

వివరంగా చదవండి: కుంభం 2025 రాశిఫలాలు

మీనరాశి

మీనరాశి 2025 జాతకం ప్రకారం మీరు సంవత్సరం ప్రారంభంలో కొన్ని హెచ్చు తగ్గులు అనుభవించవచ్చు. వాదనలు సంభవించవచ్చు, కాబట్టి మీరు మీ జీవిత భాగస్వామి చుట్టూ జాగ్రత్తగా వ్యవహరించాలి. సంవత్సరం ప్రారంభంలో కుజుడు ఐదవ ఇంట్లో ఉంటాడు అందువల్ల శృంగార సంబంధాలలో కలహాలు ఇంకా ఒత్తిడికి దారితీస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. 2025 రాశిఫలాలు ఆధారంగామీ ఖర్చులు పెరుగుతాయి. సంవత్సరం చివరి భాగంలో మీ పరిస్థితులు మారుతాయి. ఇతర దేశాలను సందర్శించే అవకాశం ఉంటుంది. మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ సంవస్త్రం మీ కెరీర్ స్థిరమైన వేగంగా ముందుకు సాగుతుంది. మే లో బృహస్పతి మీ నాల్గవ ఇంట్లోకి ప్రవేశించనప్పుడు మీ కుటుంబం మరింత ఆనందం ఇంకా ప్రశాంతతను అనుభవిస్తుంది. ఇది మీ పనికి సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకోవడంలో కూడా మీకు సహాయం చేస్తుంది.

వివరంగా చదవండి: మీనం 2025 రాశిఫలాలు 

నాణ్యమైన రత్నాలు, యంత్రం మరియు జ్యోతిష్య సేవలను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయండి: ఇక్కడ క్లిక్ చేయండి!

ఈ వ్యాసంలో అందించిన సమాచారం మీకు నచ్చుతుందని మేము ఆశిస్తున్నాము. ఆస్ట్రోక్యాంప్ తో కనెక్ట్ అయినందుకు ధన్యవాదాలు.

తరచుగా అడుగు ప్రశ్నలు

1. 2025 జాతకం ఆధారంగా ఈ సంవత్సరం ఏ రాశిచక్రం వారు అదృష్టవంతులు?

వృషభం మరియు తులరాశిలో జన్మించిన వారికి 2025 అనేక విధాలుగా మంచి సంవత్సరంగా ఉంటుంది.

2. 2025లో మేషరాశి ఆరోగ్యం ఎలా ఉంటుంది?

మేషరాశి వ్యక్తులు 2025లో వారి ఆరోగ్యంలో హెచ్చు తగ్గులు అనుభవించవచ్చు.

3. 2025 జాతకం ఆధారంగా కుంభరాశి వారి భవిష్యత్తు ఏమిటి?

కుంభరాశి వారికి 2025 సంవత్సరం అనుకూలంగా ఉంటుంది అయితే వారు కెరీర్‌లో కొన్ని హెచ్చు తగ్గులు ఎదుర్కొంటారు.

More from the section: Horoscope 3982
Buy Today
Gemstones
Get gemstones Best quality gemstones with assurance of AstroCAMP.com More
Yantras
Get yantras Take advantage of Yantra with assurance of AstroCAMP.com More
Navagrah Yantras
Get Navagrah Yantras Yantra to pacify planets and have a happy life .. get from AstroCAMP.com More
Rudraksha
Get rudraksha Best quality Rudraksh with assurance of AstroCAMP.com More
Today's Horoscope

Get your personalised horoscope based on your sign.

Select your Sign
Free Personalized Horoscope 2025
© Copyright 2025 AstroCAMP.com All Rights Reserved